హుజూరాబాద్ సెప్టెంబర్ 2 (వై 7 న్యూస్);
హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డి పేట గ్రామంలో సోమవారం నాడు లక్ష్మీనరసింహ హాస్పిటల్ హన్మకొండ వారి సౌజన్యంతో జనవికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో లక్ష్మీ నరసింహ హాస్పిటల్ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వరి గ్రామంలోని 100 మంది స్త్రీలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన వికాస సంస్థ హుజురాబాద్ సెంటర్ మేనేజర్ ఎండి ఖాజా బి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభులకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ జన వికాస సెంటర్ మేనేజర్ ఎండి ఖజా బి, సూపర్వైజర్ రవీందర్, నర్సులు ఫారా, రాజేశ్వరి , హుజురాబాద్ సెంటర్ కోఆర్డినేటర్ లీల, రజిత , కారోబార్ లు తదితర మహిళలు పాల్గొన్నారు.









