E-PAPER

పినపాక ప్రజా భవన్ లో వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన పాయం

మణుగూరు,సెప్టెంబర్ 02 వై 7 న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.పాయం మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండల్లో 2003 ఏప్రిల్ 9న ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి మండుటెండల్లో 1,475 కిలోమీటర్లు నడిచారని పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి ఇటు ఉమ్మడి రాష్ట్రాలలో అటు కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చారని 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, ఫైలుపై తొలి సంతకం,1,100 వంద కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశావని దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించారని తెలియజేశారు. ఎంతోమంది పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందించిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఒక అరుదైన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్లు మూడు నెలలు కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారని భౌతిక దూరమైన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేసి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :