E-PAPER

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

కామేపల్లి,సెప్టెంబర్02 వై 7 న్యూస్;

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో ముఖ్యంగా పేద ప్రజల హృదయాలలో, ప్రతిపేద విద్యార్థుల కుటుంబాలలో చిరస్మరణనీయుడుగా జీవితకాలం నిలిచిపోతారని, వారు లేని లోటు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ వైయస్ బ్రతికి ఉంటే రాష్ట్ర, దేశ పురోగతి వేరే లాగా ఉండేదని, ఈనాడు పేద విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్స్, పెద్దపెద్ద ఉన్నత చదువులు చదువుతున్నారంటే వైస్సార్ పెట్టిన బిక్ష అని, 2004 నుండి 2009 వరకు తెలుగు రాష్ట్రాలకు ఒక స్వర్ణ యుగం గా మిగిలిపోయిందని, అంతకుముందు చదువుకోవాలంటే పేద విద్యార్థులు డబ్బులు పోసి ఇతర రాష్ట్రంలో చదివే పరిస్థితి లేదని, ఈనాడు ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుతున్నారని, ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదించి న వారి కుటుంబాలలో వెలుగులు నింపారని తెలిపారు. 108, ఆరోగ్యశ్రీ,, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు లాంటి పథకాలు రాజకీయాలకతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు జీవితకాలం గుర్తుండిపోతాయని, వారు మొదలుపెట్టిన పథకాలు ఈనాటి వరకు అమలు అవుతున్నాయని, వైయస్ కే దక్కుతుందని తెలిపారు. అంతేకాకుండా అపర భగీరధుడు లాగా జలయజ్ఞం నిర్వహించి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్.కె పతే మహమ్మద్, భానోత్ నరసింహ నాయక్, మేకపోతుల మహేష్,ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, ఎస్.కె రబ్బానీ పాషా, శీలం పుల్లయ్య,బద్దల శేఖర్, నాగండ్ల జగ్గయ్య, పల్లపు ప్రసాద్, దాసరి గురేష్ గుండ్ల చిరంజీవి, బొమ్మగాని పిచ్చయ్య బొమ్మ గాని శ్రీను, కారంగులనాగరాజు,పగిడిపల్లి రాములు, రాయల నాగ శంకర్ వెంకటేష్ భరత్, అంబడిపూడి వెంకటయ్య చల్ల వెంకన్న బత్తుల రాంబాబు,మరియు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :