E-PAPER

సింగరేణి జి ఎం ఆఫీసులో ప్రెస్ మీట్ ;పలు ప్రశ్నలు సంధించిన విలేకరులు

మణుగూరు, ఆగస్టు 31 వై7 న్యూస్;

శనివారం నాడు జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో జరిగిన ప్రెస్ మీట్ లో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ అనంతరం విలేకరులు జిఎం కు పలు ప్రశ్నలు సంధించారు.

సింగరేణి ఏరియా హాస్పిటల్ లో వైద్యం సరిగా అందడం లేదని,సింగరేణి నుంచి వచ్చే వరద నీరు వల్ల ఒక ప్రాంతం మొత్తం మునిగిపోతుందని, ఆదివాసి గ్రామమైన రేగుల గండి కి సోలార్ విద్యుత్ వెలుగులు అందించాలని, సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో మణుగూరు చుట్టుపక్కల గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, సింగరేణి సెక్యూరిటీ గార్డ్స్ విషయంలో అవకతవకలు జరిగాయని,మిగతా వారిని ఎప్పుడూ రిక్రూట్మెంట్ చేసుకుంటారని పలు ప్రశ్నలను జిఎం దృష్టికి తీసుకువెళ్లిన విలేకరులు..

సానుకూలంగా స్పందించిన జనరల్ మేనేజర్ దుర్గం ప్రసాద్ సాధ్యమైనంత త్వరలో సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని మీడియా సమావేశంలో తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్