తూప్రాన్, ఆగస్టు 31 వై సెవెన్ న్యూస్
నేటి రోజుల్లో పానీ పూరి సేవించడం ఒక ఫ్యాషన్ గా మారింది. కానీ దీనివలన కొన్ని నిజమైన విషయాలు బయటకు రావడం జరిగింది దీని తినడం వలన శరీరంలో క్యాన్సర్ వచ్చే కారకాలు ఉత్పన్నం అవుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించినారు. అనంతరం సామాజిక మాధ్యమాలలో దీనిపై కథనాలు రావడం విశేషం. కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 20 శాంపిల్ ను పరీక్షించిన అధికారులు 25 శాతం క్యాన్సర్ కు కారణమయ్యే పదార్థాలు కెమికల్స్ వీటిలో ఉంటాయని నిర్ధారణ చేశారు. దీని గురించి కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను పానీ పూరి కేంద్రాలను బ్యాన్ చేయడం జరిగింది. ప్రజలు ఫ్యాషన్ అని భావించే ఈ పానీపూరీలకు దూరంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Post Views: 220