E-PAPER

ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

– ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలి.
– డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు చేసిన సీఐ అశోక్ రెడ్డి•
అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో శనివారం సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం లోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు పైన ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లైసెన్సు,యూనిఫామ్, వాహనాలు కండిషన్ లో ఉండేటట్లు చూసుకోవాలని,అధిక సంఖ్యలో ప్రయాణికులును ఎక్కించుకోరాదని ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలని అన్నారు. అదేవిధంగా ఎస్సై తిరుపతిరావు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామని, ప్రతి ఒక్క ఆటో డేటాని ఆన్లైన్ చేసే విధంగా కొత్తగా తయారు చేస్తున్నామని, ఆటోలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి వస్తువులు రవాణా చేయకూడదని, మైనర్లకు ఆటోలు ఇవ్వరాదని,మండలంలో ప్రతిచోట ఆటోలను తిరుగుతున్నప్పుడు కొత్తవారు కనిపించిన,జన సంచారం లేని చోట ఆటోలు నిలిపిన కూడా కచ్చితంగా కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ తిరుపతి రావు, పోలీస్ స్టేషన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్