పినపాక,ఆగస్టు23(వై7న్యూస్);
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలతో ఒప్పందం చేసుకోవడం సహజం. కానీ ఆ కంపెనీలు అవినీతి మార్గంలో నెలకొల్పి ప్రజలు సొమ్ము కొల్లగొడుతూ ఉంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు అది అదాని అయినా అంబానీ అయినా .అదాని మీ సొంత పార్టీ కార్యకర్త లాగా భావిస్తున్నారు, ప్రతిస్పందిస్తున్నారు అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు మీ వాళకం ఉంది .కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఒకటి ఒకటిగా అమలు చేస్తా ఉంటే ఓర్వలేక అక్కసు వెల్లబుచ్చుతున్నారు. కేంద్ర (బి.జె.పి) ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పాలి. ప్రతి కుటుంబానికి 15లక్షల రూపాయలు, ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇలా ఎన్ని గాలి మాటలు చెప్పారో గుర్తు చేసుకోండి.
తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, అదిగమనించగలరు.మీరు ఎన్ని కూయిక్తులు చేసినా ప్రజల మిమ్ములను నమ్మే పరిస్థితి లేదని టి.పి.సి.సి మెంబర్ & పినపాక నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ అన్నారు.