ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని తాళ్ల గూడెం బ్రాంచ్ మేనేజర్ మేళ రామస్వామి అధ్యక్షతన మంగళవారం జరిగిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, టిపిసిసి కార్యదర్శి రాం రెడ్డి గోపాల్ రెడ్డి, సెంట్రల్ బ్యాంక్ సీఈవో అబీద్ ఉర్ రెహమాన్ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే రైతు రుణమాఫీ చేపట్టిందని, రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, రైతుకు 2004 నుండి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయని, ఒకప్పుడు వ్యవసాయం చేయలేక రైతులు భూములు అమ్ముకుని వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రావడం వలన రైతులను అభివృద్ధి ప్రధాతలుగా మారిపోయారని, కోరం కనకయ్య పేర్కొన్నారు. మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ జిల్లా డిసిసిబి పరిధిలో 57,129 మంది రైతులకు దాదాపు 29 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని, కామేపల్లి బ్రాంచ్ కు 913 మంది రైతులకు రెండు కోట్ల 40 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగిందని వివరించారు, ఇంకా రుణమాఫీ రాని రైతులు అధికారులకు సరైన పత్రాలు చూపించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగింజల నర్సిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్, ఎస్.కె ఫతే మహమ్మద్ సీఐ తిరుపతిరెడ్డి కామేపల్లి ఎస్సై సాయి,జిల్లా సిపిఐ నాయకులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, Ao తారా దేవి, సొసైటీ సీఈఓ ముత్తయ్య, మాజీ ఎంపీటీసీ లు రాo రెడ్డి జగన్నాథరెడ్డి,మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, డైరెక్టర్లు, రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు









