బాన్సువాడ,ఆగస్టు 12(వై7 న్యూస్)
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కొవ్వొత్తుల ర్యాలీ
బంగ్లాదేశ్ లో హిందువులపై ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న మరణకాండ నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్ లో ఒక వర్గం హిందువులని లక్ష్యంగా పెట్టుకొని దాడులకు పాల్పడడం, చిన్న పెద్ద మహిళ యువతి వృద్ధురాలు అనే తేడా లేకుండా ఆ కామందులు అత్యాచారాలకు పాల్పడుతూ హత్యలను చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సోమవారం రాత్రి అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల గుండా హిందు ధార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రజలను చైతన్య పరచడానికి హిందూ ధార్మిక సమస్త నిర్వాకులు ముందుకు వచ్చి కొవ్వొత్తుల ర్యాలీని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు.
Post Views: 698