E-PAPER

హోటల్ యజమానులు నిబంధనలు పాటించాలి;ఎస్ఐ తాజుద్దీన్

సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి..
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం..
ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్..

వై7 న్యూస్‌, ములుగు జిల్లా ప్ర‌తినిధిః- మండలంలోని హోటల్ ,రెస్టారెంట్ల యజమానులు కచ్చితంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన నిబంధనలు పాటించాలని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు. ఆదివారం రోజున ఏటూరునాగారం మండ‌ల కేంద్రంలోని రామాలయం అవ‌ర‌ణ‌లో హోటల్ యజమాన్యులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఏస్సై తాజోద్దిన్ మాట్ల‌డుతూ..వ్యాపారస్తులు తమ వ్యాపార సముదాయాల ముందు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమని అన్నారు. దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సిసి కెమెరాల మూడవ నిఘానేత్రం ప్రాముఖ్యత ను వ్యాపారులకు వివరించారు. హోట‌ల్ల‌లో వంట నూనె రీసైక్లింగ్ చేస్తున్నారని, వంట మాస్టర్లు కూడా సరైన శుభ్రత పాటించకపోవడాన్ని గమనించామాని, నిషేధిత రంగులు అధిక మోతాదులో మసాలా వాడకాన్ని ఆహార తయారీ ఉత్పత్తి విక్రయదారులు చట్టానికి లోబడి వ్యాపారాలు చేయాల్సి ఉంటుందన్నారు. చాలా మంది వ్యాపారులు నిబంధనలు పాటించడం లేద‌ని ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నార్నారు. ఆహార భద్రత అమల్లో భాగంగా ఉత్పత్తిదారులు లైసెన్సు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. ఎప్పుడైనా నాణ్యత లేని ఆహారం అందిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చాలా రోజులు నిల్వ ఉంచిన. కుళ్ళిపోయిన, చికెన్ ,రొయ్యలు చేపలు, లాభ ప్రేక్షతో నిల్వ మాంసాన్ని విక్రయించరాదన్నారు. తీసుకున్న డబ్బుకు నాణ్యమైన మాంసాహార భోజనం సరఫరా చేయకుండా కక్కుర్తి పడి నిలువ ఉంచిన కుళ్ళిన మాంసాహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయ‌న్నారు. నాణ్యత లేకపోవడంతో సరిగ్గా జీర్ణం కావడం లేదని కల్తీ నూనెలు ఆహార పదార్థాలు వాడడమే దానికి కారణమని తెలుస్తుందన్నారు. నిలువ మాంసంతో ఆహార పదార్థాల తయారీ దుర్వాసన రాకుండా జాగ్రత్తలు పడుతూ, డి ఫ్రీజర్ లో రోజుల తరబడి మాంసం, కల్తీ నూనె మసాలా దినుసులు వాడకం, చాలా ప్రమాదకరమని అన్నారు. కనీస నిబంధనలు పాటించని యజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు హోటల్ యజమాన్యులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!