సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ అధ్యక్షతన,ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా ఇన్చార్జి పడిదేల రవి మాదిగ మాట్లాడుతూ ఆగస్టు 9వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాను ఉద్దేశించి ఏబిసిడి వర్గీకరణ ముఖ్య ఉద్దేశంగా మాదిగ, మాదిగ ఉప కులాలు ఏబిసిడి వర్గీకరణ అయితే మా జీవితాలు బాగుపడతాయని అన్నారు. 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను ప్రాణంగా ఫణంగా పెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గతంలోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని కేంద్ర మంత్రివర్యులు సుష్మ స్వరాజ్ చెప్పడం జరిగింది బిజెపి ప్రభుత్వం మాయ మాటలతో కాలయాపన చేస్తూ కమిటీల పేరుతో మాదిగలను మరోసారి మోసం చేస్తుంది.ఈ పార్లమెంటు సమావేశమైన ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని 33 జిల్లాలున్న మాదిగులంతా ఉవ్వెత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా ప్రదర్శన లో పాల్గొనాలని చెప్పటం జరిగింది.
ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరికంటి అంబేద్కర్ మాదిగ,రాష్ట్ర ఉపాధ్యక్షులు రావూరి విజయభాస్కర్, మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకు జానయ్య,మాదిగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేళ్లచెరువు ముక్కంటి మాదిగ,నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దపంగు కాటయ్య మాదిగ, టౌన్ అధ్యక్షు లు రెడప్పంగు రాము మాదిగ,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కష్టాల రవీందర్ మాదిగ, టౌన్ ప్రధాన కార్యదర్శి కందుకూరి రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు.









