E-PAPER

గళమెత్తిన అసంఘటిత కార్మిక లోకం;అండగా జైస్వరాజ్ పార్టీ

Y7 న్యూస్ తెలుగు,హైదరాబాద్;
ప్రభుత్వం తమకు తక్షణమే ప్రతి నెలా పది రోజుల పని దినాలు కల్పించాలని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్, పెయింటర్స్ అసోసియేషన్ , ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పెయింటింగ్ కార్మికుల నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంవత్సరంలో అనేక నెలలు పనులు దొరకడం లేదని, దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికల వల్ల దొరికే పని దినాలు కూడా సక్రమంగా లభించడం లేదని కృష్ణ మోహన్ పేర్కొన్నారు. అందుకే ప్రతి అసంఘటిత కార్మికునికి స్థానిక గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రతి నెలా పది రోజుల వేతనంతో కూడిన పని దినాలు కల్పించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు ఒక విధాన ప్రకటన చేసి కార్మికులను ఆదుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అసంఘటిత కార్మికులను ఏకం చేసి ప్రభుత్వ మెడలు వంచుతామని కృష్ణ మోహన్ హెచ్చరించారు.

కార్మికులు పస్తులు ఉంటున్నారు: గూడెం బిక్షపతి

అసంఘటిత కార్మికులకు పనులు దొరకడం లేదని, అనేక కార్మిక కుటుంబాలు అర్ధాకలితో పస్తులు ఉంటున్నాయని పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడెం బిక్షపతి పేర్కొన్నారు. మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో తాము కార్మిక కుటుంబాలను సందర్శించిన సందర్భంగా అనేక బాధాకరమైన విషయాలు తెలిశాయని ఆయన అన్నారు. తక్షణమే కార్మికులను ఆదుకునేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో స్థానిక అసంఘటిత కార్మికులకు పనులు కల్పించాలని బిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గూడెం బిక్షపతి, ఇంద్రాల సత్యనారాయణ, గంధమల్ల, ఇంజ గణేష్, ఎల్లేష్ , రాజు కుమార్, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!