Y 7 న్యూస్ తెలుగు భద్రాద్రి;
మూడో ప్రమాద హెచ్చరిక జారి చేయడానికి సిద్ధంగా ఉన్న అధికారులు
శబరి నది ఫోట్ ఎత్తడంతో అయోమయంలో ఉన్న ఇరిగేషన్ శాఖ
గోదావరి నది తీర గ్రామాలకు పొంచి ఉన్న పెను ముప్పు
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ కురుస్తున్న వర్షాలతో తెలంగాణకు వరద పోటెత్తుతుంది. ముఖ్యంగా మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది భద్రాచలం వద్ద గోదావరి నది పరువల్లు తొక్కుతూ అతివేగంగా ప్రవహిస్తుంది దానితో మూడో ప్రమాదం హెచ్చరిక జారీ చేసే దిశగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం గోదావరి నది 51. 50 అడుగుల వద్దకు చేరుకోగా 13,37,650 క్యూసెక్కుల వరదతో ప్రవహిస్తుంది 53 అడుగులు దాటగానే అధికారులు మూడు ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి నదిలో వరద ప్రవాహం ఎక్కువైన నేపథ్యంలో అధికారులు శనివారమే 53 అడుగులకు చేరే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకే గోదావరి నీటిమట్టం వరద ఉధృతితో దేవస్థానం స్నాన ఘట్టాల వద్ద ఉన్న కళ్యాణ కట్ట కింద భాగం పూర్తిగా మునిగిపోయింది గోదావరి నది తీర గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉందన్న అంచనా తో 111 గోదావరి నది తీర గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే దుమ్ముగూడెం చర్ల బూర్గంపాడు అశ్వాపురం పినపాక మణుగూరు మండలాల్లో పలు గ్రామాల్లో గోదావరి నీరు చేరే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒరిస్సా చతిస్ గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శబరి నది ఉప్పొంగి గోదావరికి పోటెత్తుతుంది దానితో ఇరిగేషన్ అధికారులకు అంచనాలు ఊహించని విధంగా తార్ మార్ అవుతున్నాయి.. ఏది ఏమైనా మరోసారి గోదావరి ఉగ్రరూపం నది తీర గ్రామాల ప్రజలకు భారీ నష్టం కలిగించే అవకాశం ఉందంటూ అధికారులు అంచనా వేస్తున్నారు…