తమిళనాడులో మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన వ్యవహారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి కల్లకురిచ్చి టీవీకే (TVK) ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మద్రాస్ హైకోర్టుకు పోలీసులు వెల్లడించారు.
కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అసభ్యకర సందేశాలు పంపినట్లు పలు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అన్నాడీఎంకేకు చెందిన న్యాయవాది ఆర్. తిరిసూలి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలియజేయడం కీలక పరిణామంగా మారింది.
Post Views: 8








