బట్టతల.. ప్రస్తుతం యువతను తీవ్రంగా వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో చిన్న వయసులోనే జుట్టు రాలడం, హెయిర్‌లైన్ వెనక్కి వెళ్లడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో చాలామంది ఆందోళనకు గురవుతున్నారు.
జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు మార్కెట్లో లభించే వివిధ రకాల నూనెలు, షాంపూలు, మందులను ఉపయోగిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే బట్టతల సమస్య ఎదురవుతుండటంతో దీనికి శాశ్వత పరిష్కారం కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి సమయంలో చైనా పరిశోధకులు బట్టతల సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కీలక పరిశోధన చేపట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిశోధన విజయవంతమైతే జుట్టు రాలడం, బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి భవిష్యత్తులో కొత్త ఆశలు చిగురించే అవకాశం ఉంది.
Post Views: 5








