పలాస, వై7 న్యూస్:
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చరణదాసుపురం రైల్వే క్రాసింగ్ వద్ద రైలు ఢీకొనడంతో సుమారు 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. మేత మేసుకుని తిరిగి వస్తున్న సమయంలో గొర్రెల మంద రైల్వే పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో రైలు రావడంతో గొర్రెలు రైలు కిందపడి పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి.
ఈ ప్రమాదంలో నందిగాం మండలం దేవాడ గ్రామానికి చెందిన లండ తిరుపతి, జాడుపూడి గ్రామానికి చెందిన తోంప భూపతిలకు చెందిన గొర్రెలు మృతి చెందినట్లు గుర్తించారు.
ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడటంతో గొర్రెల కాపరులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
Post Views: 14









