E-PAPER

భార్యపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన భర్త, సహకరించిన నిందితుని తల్లి ఇద్దరు అరెస్ట్.

– చికిత్స పొందుతూ భార్య మృతి.
– మొదట దాడి కేసు నమోదు చేసి అనంతరం హత్య కేసుగా మార్పు చేసి నిందితులను అరెస్టు చేశారు

హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమందరాజు వెల్లడి

సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటనకు సంబంధించి నిందితుడైన భర్తను అచ్చయ్యను, సహకరించిన నిందితుని తల్లి వెంకమ్మ ఇద్దరినీ మఠంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

పెదవీడు గ్రామానికి చెందిన దేశబోయిన చంద్రకళకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో తన తల్లి నివసించే హుజూర్‌నగర్‌లోని ఇంటికి వెళ్తానని భర్త అచ్చయ్యకు చెప్పింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన అచ్చయ్య ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో చంద్రకళ తలపై కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. గాయపడిన చంద్రకళను అంబులెన్స్‌లో హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం చికిత్స పొందుతు మృతి చెందింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమందరాజు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మట్టంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!