E-PAPER

అక్రమ కేసులతో బెదిరిస్తే భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాటం ఆగదు: కంగాటి శ్రీదేవమ్మ

కర్నూలు: రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేసి నాయకులను బెదిరించాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అక్రమ కేసుల నేపథ్యంలో అరెస్టయిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఈరోజు విడుదలయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు సమీపంలోని పంచలింగాల జైలు వద్ద ఆయనను కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.వి. మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కలిసి పరామర్శించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు నమోదు చేసి నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయమే గెలిచిందని, నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని శ్రీదేవమ్మ వ్యాఖ్యానించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!