నాచురల్ స్టార్ నాని జడల్ జమాన్ పాత్ర నుంచి బయటపడ్డారని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన ది ప్యారడైజ్(The Paradise) సినిమా విడుదల కావడంతో నాని తన తదుపరి సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని తెలుస్తుంది. నాని తన తదుపరి చిత్రాన్ని ఓజీ డైరెక్టర్ సుజిత్ (Sujeeth)దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమాను అధికారక ప్రకటన తెలియచేయడమే కాకుండా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తాజాగా నాని పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తి అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా లుక్ టెస్ట్‌లో నాని సరికొత్త హెయిర్‌స్టైల్, స్టైలిష్ స్పెక్స్ ధరించి ట్రెండీ, క్లాసీ అండ్ చామింగ్ అవతార్‌లోకి మారారు. నాని కెరీర్‌లోనే ఇప్పటివరకు చూడని సరికొత్త గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉండబోతుందని సమాచారం. ఈ భారీ యాక్షన్ డ్రామాను వెంకట్ బోయన పల్లి,నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇలా నాని గ్యాంగ్స్టర్ పాత్రలో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలో హీరోయిన్ గా ఎవరు సందడి చేయబోతున్నారనే విషయాలపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తెలియాలి అంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమా దసరా సందర్భంగా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.








