E-PAPER

దసరా సెలవులు.. సముద్రతీరాల్లో పటిష్ట భద్రత

పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు.. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు

బాపట్ల, అక్టోబర్ 10 (Y7 న్యూస్):

దసరా సెలవుల నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు తెలిపారు. సముద్రతీర ప్రాంతాల్లో పోలీసు గస్తీని పెంచడంతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

బాపట్ల జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

పర్యాటకులు సముద్రతీరాల్లో పోలీసుల హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సముద్రంలోకి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. పోలీసు శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

పర్యాటకుల భద్రతే ప్రధాన లక్ష్యమని, దసరా సెలవుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!