కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవలనాగారంలో ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 800 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
మణుగూరు ఎక్సైజ్, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్, కొత్తగూడెం డీటీఎఫ్ బృందాలు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టాయి. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు.
Post Views: 19









