కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం తహసీల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాల చెక్కులను పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

— Y7 News Telugu | ప్రజల గొంతుక
Post Views: 15









