భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – చర్ల:
చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీలో అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిప్పర్లను గ్రామ పంచాయతీ ప్రజలు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో గ్రామస్థులకు, గ్రావెల్ తరలిస్తున్న వారిగా పేర్కొంటున్న వ్యక్తులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో లక్ష్మీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గ్రావెల్ తరలింపునకు అనుమతులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై అధికారులు విచారణ జరిపి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Y7 NEWS TELUGU – ప్రజల గొంతుక
Post Views: 61









