పరిపాలన వికేంద్రీకరణలో పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని కార్యక్రమం
మణుగూరు: బీఆర్ఎస్ పార్టీ హయాంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త మండలాలు, గ్రామపంచాయతీల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా ఆదివారం (అక్టోబర్ 11) మణుగూరులో 1 కిలోమీటర్ రన్నింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఉదయం 6 గంటలకు మణుగూరులోని సురక్ష బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత, విద్యార్థులు, క్రీడాభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పినపాక మాజీ ఎమ్మెల్యే, మాజీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
Post Views: 18









