E-PAPER

మణుగూరు ఏరియా గనుల వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష

2027-28 ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాల సాధనపై అధికారుల చర్చ

మణుగూరు, అక్టోబర్ 10 (Y7 న్యూస్ తెలుగు): సింగరేణి మణుగూరు ఏరియాలోని గనులకు సంబంధించి 2027-28 ఆర్థిక సంవత్సర వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ అధ్యక్షతన జనరల్ మేనేజర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, ఓవర్‌బర్డెన్ తొలగింపు, గనుల ఉత్పత్తి సామర్థ్యం, యంత్ర పరికరాల లభ్యత, బొగ్గు నాణ్యత మెరుగుదల, ఉత్పత్తి వ్యయ నియంత్రణ వంటి అంశాలపై సమీక్షించారు.

నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన డంపర్లు, డోజర్లు, క్రషర్లు, పంపింగ్ పరికరాలు, ఇతర సాంకేతిక వసతులపై చర్చించారు. బొగ్గు నాణ్యతను మెరుగుపరచడం, బొగ్గు పొరలను షేల్ పొరల నుంచి సక్రమంగా వేరు చేయడం, సర్ఫేస్ మైనర్ సాంకేతికతను వినియోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అంశాలను పరిశీలించారు.

ఓసీ-II విభాగంలో నీటి తొలగింపు సామర్థ్యాన్ని పెంచడం, పాత యంత్ర పరికరాల కారణంగా ఏర్పడుతున్న అంతరాయాలను తగ్గించడం, అవసరమైన అధికారులు, పర్యవేక్షకులు, సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై చర్చించారు.

2027-28 ఆర్థిక సంవత్సర లక్ష్యాలను సాధించేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం, యంత్ర పరికరాల సమర్థ వినియోగం, బొగ్గు నాణ్యత పరిరక్షణ, ఉత్పత్తి వ్యయ నియంత్రణతో పాటు గని కార్యకలాపాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో ఏరియా ఉన్నతాధికారులు, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, గని ఏజెంట్లు, ప్రాజెక్టు అధికారులు, ఏరియా హెచ్‌ఓడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Y7 News Telugu | ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!