మణుగూరు: దసరా సంబరాలు–2026ను పురస్కరించుకొని మణుగూరులోని పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో ఈ నెల 20న సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గల వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మణుగూరు ఏరియా ఏజీఎం (పర్సనల్) ఎస్. రమేశ్ తెలిపారు.
దసరా వేడుకల ప్రాంగణంలో తినుబండారాలు, ఇతర వ్యాపార ఉత్పత్తుల విక్రయాల కోసం స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యాపారులు కంపెనీ నిబంధనలకు అనుగుణంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తుదారులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో అందజేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9951210143.
— వై7 న్యూస్ తెలుగు









