E-PAPER

ఏజెన్సీలో యథేచ్ఛగా తెల్లరాయి తవ్వకాలు.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

ప్రకృతి సంపదను అక్రమంగా కొల్లగొడుతున్న బకాసురులు?

అధికారుల చేతివాటమేన.. లేక అధికారుల పర్యవేక్షణ కరువు?..

చింతూరు , (వై7 న్యూస్) అక్టోబరు 10:
పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో తెల్లరాయి తవ్వకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కల్లేరు పంచాయతీ పరిధిలోని కుయుగూరు గ్రామ సమీపంలో భారీగా రాళ్లను తవ్వి ఒకచోట గుట్టలుగా పోసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ తవ్వకాలు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయి? సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి.
నిబంధనలు అమలవుతున్నాయా?
ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి వనరులకు నిలయంగా ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో ఖనిజ సంపద వెలికితీతకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు, పర్యావరణ అనుమతులు పాటించడం అత్యంత ముఖ్యం. అయితే కుయుగూరు గ్రామ సమీపంలో కనిపిస్తున్న రాతి తవ్వకాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత శాఖలు స్పందించాలి!
కుయుగూరు గ్రామ సమీపంలో తెల్లరాయి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? ఎంత విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారు? ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ చెల్లిస్తున్నారా? పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోంది? అనే అంశాలపై గనుల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంత సహజ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!