
సభ్యుల సమస్యలు, హెల్త్ కార్డులపై చర్చ
భద్రాచలం, అక్టోబర్ 10 ( వై 7న్యూస్);
భద్రాచలం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ జనరల్ బాడీ రెండో సమావేశం స్థానిక టీఎస్ టూరిజం వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు కుప్పాల నాగరాజు ఆధ్యర్యంలో జరిగిన ఈ సమావేశంలో క్లబ్ సభ్యుల సంక్షేమం, హెల్త్ కార్టుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా క్లబ్ సభ్యులకు హెల్త్ కార్టులు అందించే అంశంతో పాటు, సభ్యులు ఎదుర్యొంటున్న సమస్యలను సమావేశంలో ప్రస్థావించారు. జర్బలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, సభ్యుల సమస్యల పరిష్యారానికి సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు పూనెం ప్రదీప్ కుమార్, సెక్రటరీ జెట్టి జస్వంత్, ఉపాధ్యక్షుడు తమ్మల రాజేష్ ,ట్రెజరర్ లంక రాజేష్, , సహాయ కార్యదర్శి స్వతంత్ర రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.









