చత్తీస్గఢ్, సుక్మా జిల్లా:
సుక్మా జిల్లాలో మందుపాతర పేలిన ఘటనలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బెజ్జి పోలీస్స్టేషన్ పరిధిలోని బొడ్రాజ్పదర్ కల్వర్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మందుపాతరను నిర్వీర్యం చేసేందుకు వెళ్లిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS) బృందం సభ్యులు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
మందుపాతరను నిర్వీర్యం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్లు సమాచారం. ఘటనలో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారికి సుక్మా జిల్లా కుంట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Post Views: 63








