ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, సెప్టెంబర్ 14 (వై7 న్యూస్): మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా గణపతి 24వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మహోత్సవాల్లో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గణపతి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








