కరకగూడెం, సెప్టెంబర్ 14:
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమద్ బట్టుపల్లి గ్రామ పెద్దలు, YRS యువజన సభ్యులు వినూత్నంగా మట్టి వినాయక విగ్రహాన్ని స్వయంగా తయారు చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితికి మట్టి విగ్రహాన్ని స్వయంగా తయారు చేసి పూజలు నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతిని రక్షించుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని సమాజానికి అందిస్తూ గ్రామ యువత చేస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం.
భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయకుడిని తయారు చేయడం ద్వారా సమద్ బట్టుపల్లి గ్రామ పెద్దలు, యువత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభినందిస్తున్నారు.
మట్టి వినాయకుడు… మన సంప్రదాయం, మన బాధ్యత అనే సందేశంతో సాగుతున్న ఈ కార్యక్రమం పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్
Y7 న్యూస్ తెలుగు








