దుమ్ముగూడెం, సెప్టెంబర్ 14:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చర్ల వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో మద్ది రాము (40) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
గురువేముల నుంచి రాము వస్తుండగా లక్ష్మీనగరంలోని ఎస్‌బీఐ బ్యాంక్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన రాము సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రిపోర్టర్:దివ్య Y7 న్యూస్ తెలుగు
Post Views: 70








