E-PAPER

మణుగూరు విద్యార్థుల కరాటే ప్రతిభ

మణుగూరు, సెప్టెంబర్ 14 (Y7 న్యూస్ తెలుగు):

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 13న నిర్వహించిన తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో మణుగూరుకు చెందిన ఖడ్గ కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి పలు పతకాలు సాధించినట్లు సీనియర్ లేడీ కరాటే మాస్టర్ కాశిమల్ల పద్మ తెలిపారు.

పోటీల్లో బ్లాక్ బెల్ట్ గర్ల్స్ విభాగంలో రిషిక బంగారు పతకం సాధించగా, బ్లాక్ బెల్ట్ బాయ్స్ విభాగంలో జ్ఞానేష్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ధృవిక కాంస్య పతకం, వేణుగోపాల్ రజత పతకం, నిహార్ ఒక బంగారు మరియు ఒక రజత పతకం, కార్తీక్ రజత పతకం, సాత్విక ఒక బంగారు మరియు ఒక రజత పతకం, లిఖిత్ కాంస్య పతకం సాధించి మణుగూరుకు గర్వకారణంగా నిలిచారు.

పతక విజేతలను ఇండియా టీమ్ హెడ్ కోచ్ కిరణ్ కొండూరు, తల్లిదండ్రులు మరియు క్రీడాభిమానులు అభినందించారు. విద్యార్థుల విజయానికి అకాడమీ శిక్షణ, కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణమని బ్లాక్ బెల్ట్ 4వ డాన్ కాశిమల్ల పద్మ పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!