E-PAPER

నెలకు రూ.1,500 పొదుపుతో రూ.8.32 లక్షలు.. ఆడపిల్లల కోసం కేంద్రం పథకం

ఆడపిల్ల భవిష్యత్తు చదువులు, పెళ్లి వంటి అవసరాల కోసం చిన్నప్పటి నుంచే పొదుపు చేయాలని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వయసు పూర్తయ్యేలోపు ఈ ఖాతాను తెరవవచ్చు. ఇందులో ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేసుకునే అవకాశం ఉంది.

ఉదాహరణకు నెలకు రూ.1,500 చొప్పున ఖాతాలో జమ చేస్తే ఏడాదికి రూ.18,000 పెట్టుబడి అవుతుంది. నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల పాటు ఇదే మొత్తాన్ని జమ చేస్తే మొత్తం పెట్టుబడి రూ.2.70 లక్షలు అవుతుంది. ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తే సుమారు రూ.5.61 లక్షల వడ్డీ లభించి, మెచ్యూరిటీ సమయంలో మొత్తం సుమారు రూ.8.32 లక్షలు అందే అవకాశం ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజనలో వడ్డీ రేటును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. అందువల్ల భవిష్యత్తులో వడ్డీ రేటులో మార్పులు జరిగితే మెచ్యూరిటీ సమయంలో లభించే మొత్తం కూడా మారవచ్చు. ఆడపిల్ల ఉన్న కుటుంబాలు తమ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలికంగా పొదుపు చేసుకునే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!