మణుగూరు, సెప్టెంబర్ 12: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో ‘శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ’ ఆధ్వర్యంలో రసాయన రహిత మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
సంస్థ (రెజి. నెం. 151/2022) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 ఆదివారం సాయంత్రం నుంచి సెప్టెంబర్ 14 సోమవారం ఉదయం వరకు భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందజేయనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు, సామాజిక సేవాకర్త చెరుకుపల్లి ఉపేందర్‌రావు, అధ్యక్షులు దండా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ఉప్పాడి అనిత, ఉపాధ్యక్షురాలు తమ్మిశెట్టి రమాదేవి, కోశాధికారి రాయపరెడ్డి సత్యనారాయణ తెలిపారు.
మణుగూరు పూల మార్కెట్‌లోని శ్రీదేవి మెడికల్ షాప్ వద్ద ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు చెరుకుపల్లి ఉపేందర్‌రావు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయన రంగులతో తయారు చేసిన గణపతి విగ్రహాల వల్ల చెరువులు, బావులు, జలాశయాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. దీని ప్రభావం పర్యావరణంతో పాటు మానవులు, మూగజీవాలపై పడే అవకాశం ఉందని తెలిపారు.

సంస్థ అధ్యక్షులు దండా నరసింహారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
“కాలుష్య రహిత సమాజం కోసం మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుకుందాం” అని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సంప్రదించవలసిన నంబర్లు:
చెరుకుపల్లి ఉపేందర్‌రావు – 8897926405
దండా నరసింహారావు – 9948700424
ఉప్పాడి అనిత – 9494071368








