E-PAPER

గొల్లగుప్పలో అధికారుల నిర్లక్ష్యానికి గిరిజన బాలిక బలి – కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి


ఎంపీ గుమ్మ తనూజా రాణి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ధ్వజం!

రవాణా సౌకర్యం లేకున్నా అడవిలో కాలి నడకన గొల్లగుప్ప గ్రామానికి చేరుకున్న నేతలు..

ఇంత పెద్ద విపత్తు జరిగినా గ్రామం వైపు కన్నెత్తి చూడని అధికార పార్టీ (కూటమి) ఎమ్మెల్యే!

బాధిత గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అందని ఎలాంటి న్యాయం, ఆర్థిక సహాయం!

గిరిజనుల అత్యవసర వైద్యం కోసం లక్ష్మీపురం పీహెచ్‌సీకి ఎంపీ నిధుల నుండి అంబులెన్స్ మంజూరు చేసిన డాక్టర్ తనూజా రాణి!ఎటపాక

ఎటపాక (వై7 న్యూస్ తెలుగు) సెప్టెంబర్ 12 : చింతూరు డివిజన్ , ఎటపాక మండలం లో ఇటీవల జరిగిన గొల్లగుప్ప ఘటన పై ఎంపీ గుమ్మ తనూజా రాణి అధికారుల ఘోర నిర్లక్ష్యం ప్రభుత్వ అలసత్వం ఒక గిరిజన చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్నాయి అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా.. గిరిజన ప్రాంతాల్లోని పేదల ప్రాణాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి, అధికారులకు అంత చులకనా?.. అంటూ అరకు పార్లమెంట్ ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజా రాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ చర్యల్లో భాగంగా పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి, రెండో తరగతి విద్యార్థిని మడవి జమున మరణించడం, 50 మందికి పైగా చిన్నారులు ఆసుపత్రి పాలైన ఘోర విపత్తుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు రణభేరి మోగించారు . రవాణా సౌకర్యం లేకున్నా కాలి నడకన ఆ గ్రామానికి చేరుకొని బాధితుల ఘోషను విన్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పటివరకు ఆ గ్రామాన్ని సందర్శించక పోవడం పై ఎమ్మెల్యే ను ప్రశ్నించారు? ఈ ఘోర కలికానికి గురైన బాధితులను ఓదార్చేందుకు ఎంపీ గుమ్మ తనూజా రాణి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి స్వయంగా రంగంలోకి దిగారు. గొల్లగుప్ప గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోయినప్పటికీ, దారి పొడవునా ఉన్న కొండలు, గుట్టలను లెక్కచేయకుండా నేతలిద్దరూ కాలి నడకన నడుచుకుంటూ గొల్లగుప్ప గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్ళి అస్వస్థతకు గురైన చిన్నారులను, వారి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తాము రవాణా సౌకర్యాలు లేకపోయినా కొండలు నడుచుకుంటూ వచ్చి బాధితులను పరామర్శిస్తుంటే, ఓట్లు వేయించుకున్న అధికార పార్టీ (కూటమి) ఎమ్మెల్యే మాత్రం ఇప్పటివరకు ఈ గ్రామాన్ని కన్నెత్తి కూడా చూడకపోవడం గిరిజనుల పట్ల వారికున్న నిర్లక్ష్యానికి, అహంకారానికి నిదర్శనమని మండిపారు. గిరిజన ఓట్లతో గెలిచి, వారి ప్రాణాలు ప్రమాదంలో పడితే పత్తా లేకుండా పోతారా? అని నిలదీశారు. గిరిజనుల ప్రాణాల రక్షణకు ఎంపీ పెద్ద మనసు చేసుకొని లక్ష్మీపురం పీహెచ్‌సీకి అంబులెన్స్ మంజూరు కు హామీ ఇచ్చారు. ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను గాలికొదిలేసినా, ఒక వైద్యురాలిగా గిరిజన ప్రజల కష్టాలను చూసి ఎంపీ తనూజా రాణి తక్షణమే స్పందించారు. ఏజెన్సీ ఏరియాలో అత్యవసర సమయాల్లో రవాణా సౌకర్యం లేక రోగులు, గర్భిణీలు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితిని గమనించిన ఆమె, లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తన పార్లమెంట్ సభ్యుల నిధుల నుండి ప్రత్యేకంగా ఒక అంబులెన్స్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తానే స్వయంగా చొరవ తీసుకుని చేయడంపై స్థానిక గిరిజన ప్రజలు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇప్పటివరకు అందని సహాయం.. ప్రభుత్వ వైఫల్యంపై నిప్పులు:

బాధిత గిరిజన కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి న్యాయం గాని, తక్షణ ఆర్థిక సహాయం గాని అందకపోవడంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదరికాన్ని ఎగతాళి చేస్తారా?: ఒక చిన్నారి ప్రాణం పోయి, వందలాది మంది ఆసుపత్రుల పాలై విలవిలలాడుతుంటే కనీసం తక్షణ సాయం అందించే నాథుడే కరువయ్యాడని ధ్వజమెత్తారు.వైద్యం పేరిట ప్రాణాలు తీస్తారా?: ఎలాంటి ప్రాథమిక పరీక్షలు లేకుండా, కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఏజెన్సీ ఏరియాలోని చిన్నారులపై ఇలాంటి తీవ్రమైన డోసేజ్ మాత్రలతో ప్రయోగాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.నేరపూరిత నిర్లక్ష్యం: మాత్రలు వేసుకున్న వెంటనే చిన్నారులు వాంతులు చేసుకుంటూ విలవిలలాడుతున్నా, స్థానిక వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!