E-PAPER

హార్ముజ్‌పై గల్ఫ్ దేశాల కీలక నిర్ణయం.. ఇరాన్‌తో చర్చలకు సిద్ధం

హార్ముజ్ జలసంధి భవిష్యత్తుపై ఇరాన్‌తో చర్చలు జరిపే అంశాన్ని గల్ఫ్ దేశాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇరాన్‌కు సందేశం కూడా పంపినట్లు సమాచారం. ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి విషయంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో గల్ఫ్ దేశాలు ఈ నిర్ణయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు, యెమెన్‌లో హౌతీల కార్యకలాపాలు, కీలక సముద్ర మార్గాల్లో ఏర్పడుతున్న అంతరాయాలు ప్రాంతీయ పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ మార్గంలో రవాణాకు ఆటంకాలు ఏర్పడితే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇదే సమయంలో చమురు సరఫరాపై అనిశ్చితి పెరగడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపైనా ఒత్తిడి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్‌తో చర్చలు జరపడం ద్వారా హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!