E-PAPER

‘ఇడుపు కాయితం’ నుంచి తొలి పాట.. ఆకట్టుకుంటున్న ప్రియదర్శి, నాగదుర్గ కెమిస్ట్రీ

ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ‘శ్రీలత..’ అనే తొలి రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.

సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటకు అలరాజు తెలంగాణ యాసలో సాహిత్యం అందించారు. శంకర్ బాబు కందుకూరి, మోహన భోగరాజు ఆలపించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్, నూతన సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ పాటలో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా కనిపించారు. కొత్తగా పెళ్లైన భార్యాభర్తలుగా శ్రీనివాస్, శ్రీలత పాత్రల్లో కనిపిస్తూ వారి మధ్య ప్రేమ, సరదా క్షణాలను పాటలో చూపించారు.

‘నువ్వు సిన్నబోకే నా శ్రీలత’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో ప్రియదర్శి, నాగదుర్గ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరి డ్యాన్స్ మూవ్స్, సహజమైన నటన పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెలోడీ ట్యూన్‌కు తెలంగాణ ఫోక్ టచ్‌ను జోడిస్తూ సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అలరాజు రాసిన తెలంగాణ యాస పదాలు కూడా పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!