E-PAPER

Fire-Boltt నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు.. సెప్టెంబర్ 1 నుంచి Flipkartలో సేల్

ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ Fire-Boltt స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. కంపెనీ తన కొత్త సబ్-బ్రాండ్ ‘Boltt’ ద్వారా Boltt Ace 5G, Boltt Evo పేరుతో రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను మంగళవారం పరిచయం చేసింది. ఈ ఫోన్లను అందుబాటు ధరలో తీసుకొచ్చి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Boltt Ace 5G, Boltt Evo స్మార్ట్‌ఫోన్లు భారీ 6,000mAh బ్యాటరీతో రానున్నాయి. అలాగే రెండు ఫోన్లలోనూ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు కొత్త సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు సెప్టెంబర్ 1 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Flipkartలో విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. బడ్జెట్ విభాగంలోకి Fire-Boltt ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!