E-PAPER

రిలయన్స్‌ జియో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను మరోసారి పెంచుతుందా..?

రిలయన్స్‌ జియో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను మరోసారి పెంచుతుందా? టెలికాం వినియోగదారుల్లో నెలకొన్న ఈ ప్రశ్నకు జియో ప్లాట్‌ఫామ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే, కేవలం టారిఫ్‌ల పెంపుపైనే ఆధారపడకుండా వినియోగదారులకు మరిన్ని డిజిటల్‌ సేవలను అందించి, వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే తమ వ్యూహమని వెల్లడించారు. అవసరమైతే ధరలు పెంచే అవకాశం కూడా ఉందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

జియో ప్లాట్‌ఫామ్స్‌ ప్రతిపాదిత మెగా ఐపీఓ నేపథ్యంలో ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆకాశ్‌ అంబానీ ఈ విషయాలను వెల్లడించారు. మొబైల్‌ టారిఫ్‌లను పెంచడం టెలికాం కంపెనీలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మార్గమేనని పేర్కొన్నారు. అయితే, ప్రతి గిగాబైట్‌ డేటాకు ఎంత ధర వసూలు చేయాలనే అంశంపైనే వ్యాపార వృద్ధిని ఆధారపరచుకోవడం తమ ఉద్దేశం కాదన్నారు. కస్టమర్లకు అదనపు సేవలను అందించి, వాటికి తగిన ధర నిర్ణయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ధరల పెంపునకు అవకాశం..!

జియో టారిఫ్‌లను ఎప్పుడు పెంచుతుందనే ప్రశ్నకు ఆకాశ్‌ అంబానీ నిర్దిష్టమైన గడువును వెల్లడించలేదు. అదే సమయంలో భవిష్యత్తులో ధరలు పెంచబోమని కూడా హామీ ఇవ్వలేదు. దీంతో రీఛార్జ్‌ ధరల పెంపుపై తుది నిర్ణయం ఇంకా స్పష్టంగా లేదని అర్థమవుతోంది. వినియోగదారులకు అందించే సేవల పరిధిని విస్తరించి, వాటి విలువ ఆధారంగా ఆదాయాన్ని పెంచుకోవడానికే సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

భారత్‌లో తలసరి ఆదాయంతో పోలిస్తే టెలికాం సేవలపై వినియోగదారులు చేస్తున్న వ్యయం 1 శాతానికి మించడం లేదని ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు. పరిశ్రమలో ఒక గిగాబైట్‌ డేటాకు సగటున రూ.7.50 వసూలు చేస్తుండగా, జియోలో ఈ వ్యయం రూ.4.90 మాత్రమేనని తెలిపారు. తమ వినియోగదారులు నెలకు సగటున 43.7 జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!