E-PAPER

తాజా, మాజీ ఎమ్మెల్యేలకు ఊకె ముద్దరాజు ఓపెన్ ఛాలెంజ్

రెండు దశాబ్దాలుగాపాలిస్తున్నారు… పినపాకకు ఏం చేశారు..?

కోట్ల సీఎస్ఆర్ నిధుల లెక్కలు చెప్పే దమ్ముందా..?

ప్రభుత్వ భూములు ఎక్కడికి పోయాయో ప్రజలకు చెప్పాలి..!

తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ప్రజల ముందు చర్చకు రావాలి..!

మైకుల ముందు అరవడం కాదు… ప్రజల ముందు లెక్కలు తేల్చుకుందాం..!

దమ్ముంటే అంబేద్కర్ సెంటర్‌కు రండి… నిజాలు బయటపెడతా..!

మణుగూరు: పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఊకె ముద్దరాజు తీవ్ర సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇద్దరూ కలిపి 22 సంవత్సరాలకు పైగా అధికారాన్ని అనుభవించారు. ఒకరు నిన్న అధికారంలో ఉన్నారు… మరొకరు నేడు అధికారంలో ఉన్నారు. కానీ పినపాక ప్రజలకు జరిగిన మేలు ఎంత..? ప్రభుత్వ భూములు మిగిలింది ఎంత..? స్థానిక యువతకు దక్కిన ఉద్యోగాలు ఎన్ని..? కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి..?” అని ప్రశ్నించారు.

పినపాక నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా మీరే పాలించారు. ఎన్నికల సమయంలోఎన్నికలప్పుడు నెమలికన్నుల హామీలు కురిపించడం, గెలిచాక ప్రజలను నట్టేట ముంచడం మీకు వెన్నతో పెట్టిన విద్య.ఇప్పుడు ప్రజల ముందు నిజాలు మాట్లాడే ధైర్యం ఉందా..?” అని ఊకె ముద్దరాజు నిలదీశారు.

సింగరేణి, బీపీఎల్, హెవీ వాటర్ ప్లాంట్, బీటీపీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన నిలదీశారు.ఈ నిధులతో మారిన గ్రామాల రూపురేఖలేవి?
కట్టిన బడులు, తెరిచిన ఆసుపత్రులు ఎక్కడ?
ఆ నిధుల లెక్కలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? స్థానిక నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు..? అనే వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు.

“22 ఏళ్ల క్రితం పినపాక నియోజకవర్గంలో ఎంత ప్రభుత్వ భూమి ఉంది..? ఇప్పుడు ఎంత మిగిలింది..? ఎవరి హయాంలో ఎంత తగ్గింది..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏం చేశారు..? నా దగ్గర పూర్తి డేటా ఉంది. ఒక్కో లెక్క ప్రజల ముందు పెడతా. నిజాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా… మీరు సిద్ధమేనా..?” అని సవాల్ విసిరారు.

ప్రెస్‌మీట్లు పెట్టి మైకుల ముందు మాట్లాడటం కాదు… సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు… నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే మణుగూరు అంబేద్కర్ సెంటర్‌కు రండి. ప్రజల సమక్షంలో, మీడియా సాక్షిగా బహిరంగ చర్చకు కూర్చుందాం అని అన్నారు.

దమ్ముంటే రండి… మీడియా ముందు నిజాలు మాట్లాడుకుందాం. ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రజల ముందే తేల్చుకుందాం. పినపాక ప్రజలు అమాయకులు కాదు. మీ పాలనలో జరిగిన ప్రతి విషయం వారికి తెలియాల్సిన హక్కు ఉంది. నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నా… మీ ఇద్దరూ సమాధానం చెప్పాల్సిందే” అని ఊకె ముద్దరాజు స్పష్టం చేశారు.

చివరగా, ప్రజల తీర్పే అంతిమ తీర్పు. మణుగూరు అంబేద్కర్ సెంటర్ వేదికగా ఎవరు ప్రజల కోసం పనిచేశారో… ఎవరు రాజకీయాల కోసం ప్రజలను వాడుకున్నారో తేల్చుకుందాం. ప్రజల ముందు నిజాలు చెప్పడానికి నేను సిద్ధం… మీరు సిద్ధమా..? అంటూ తాజా, మాజీ ఎమ్మెల్యేలకు ఊకె ముద్దరాజు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!