E-PAPER

రష్యాలో ల్యాండైన అమెరికా సైనిక విమానం.. అసలు కారణమేంటి?

అమెరికాకు చెందిన ఓ సైనిక రవాణా విమానం మంగళవారం రష్యాలోని మాస్కో వ్నుకోవో విమానాశ్రయంలో ల్యాండ్ కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో విమానం ఎందుకు రష్యాకు వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వివరాల ప్రకారం ఈ విమానం లాట్వియాలోని రిగా నుంచి మాస్కోకు వెళ్లింది.

ఈ విమానం బోయింగ్ C-17 గ్లోబ్‌మాస్టర్ III అని గుర్తించారు. ఇది అమెరికా వైమానిక దళం ఉపయోగించే భారీ సైనిక రవాణా విమానం. సైనిక సిబ్బంది, పరికరాలు, వాహనాలు, ఇతర కీలక సామగ్రిని సుదూర ప్రాంతాలకు తరలించేందుకు C-17ను ఉపయోగిస్తారు. ఈ విమానం ఆగస్టు 23న అమెరికాలోని క్యాంప్ స్ప్రింగ్స్ నుంచి రిగాకు చేరుకుని, మంగళవారం మాస్కోకు వెళ్లినట్లు సమాచారం.

విమానం మాస్కోకు ఎందుకు వెళ్లిందనే దానిపై అమెరికా లేదా రష్యా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజా నివేదికల ప్రకారం అమెరికా CIA డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ మాస్కోలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన పర్యటన ఉద్దేశం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో ఈ సైనిక విమానం రష్యా పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!