పలాస, వై7 న్యూస్: పలాస నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు. పలాసలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం రూ.6,03,038 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బుడ్డు ఊర్మిళకు రూ.2,13,734, రత్నాల ఈశ్వరరావుకు రూ.2,16,841, ఉదయపురం మనోహర్‌కు రూ.1,72,463 చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, అత్యవసర వైద్య చికిత్సలు మరియు ఇతర అవసరాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.
ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








