దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ జియో హోమ్ వినియోగదారుల కోసం కొత్త Jio Home 3-in-1 సర్వీస్ ప్యాక్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లలో హై-స్పీడ్ Wi-Fi, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ ఒకే ప్యాక్‌లో లభిస్తుంది. ఈ ప్లాన్‌ల ప్రారంభ ధర నెలకు రూ.400గా ఉంది. దీంతో ఇంటర్నెట్, టీవీ, OTT సేవలను విడివిడిగా తీసుకునే అవసరం లేకుండా ఒకే ప్యాక్‌లో పొందవచ్చు.
హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు టీవీ ఛానెల్స్, OTT సేవలను వినియోగించాలనుకునే వారికి ఈ 3-in-1 ప్లాన్‌లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులు వివిధ రకాల కంటెంట్‌ను చూసే వారికి ఒకే కనెక్షన్‌తో బహుళ సేవలను అందించేలా జియో వీటిని రూపొందించింది. లైవ్ టీవీతో పాటు ప్రముఖ OTT కంటెంట్‌ను కూడా ఒకే ప్యాక్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా టీవీ మాత్రమే లేదా Wi-Fi మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్‌లను కూడా జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ అవసరానికి అనుగుణంగా వినియోగదారులు ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. రూ.400 ప్రారంభ ధరతో వచ్చిన ఈ కొత్త Jio Home ప్లాన్‌లు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.









