E-PAPER

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం, జూలై 30 (వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలోకి వరద నీరు చేరుతోంది.

బుధవారం సాయంత్రం నాటికి భద్రాచలం గోదావరి నీటిమట్టం 25 అడుగులకు చేరుకుని ప్రవహిస్తోంది. గత కొన్ని గంటలుగా నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితులపై అధికారుల సూచనలు పాటించాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News