శ్రీకాకుళం జిల్లా, పలాస, వై7 న్యూస్, జూలై 29:
ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో వారి వద్ద నుంచి 34.29 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post Views: 8








