పలాస, జూలై 21 (వై7 న్యూస్): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను హత్య కేసుగా మార్చారని వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా విమర్శించారు.
సోమవారం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన నివాసంలో కలిసి పరామర్శించిన వారు, ప్రమాద ఘటనలో అప్పలరాజు కుమారుడిపై హత్య కేసు నమోదు చేయడాన్ని ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీదిరి అప్పలరాజుకు వైఎస్సార్సీపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రమాద ఘటనను కావాలనే హత్య కేసుగా మార్చడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 16








