E-PAPER

భోజ్‌శాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నమాజ్‌కు ప్రత్యామ్నాయ స్థలం కల్పించాలని సూచన

మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజ్‌శాల ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న ముస్లిం పక్షం అభ్యర్థనకు కోర్టు అంగీకరించలేదు. అయితే, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ నిర్వహించేందుకు భోజ్‌శాల సమీపంలో ప్రత్యామ్నాయ బహిరంగ ప్రదేశాన్ని అందుబాటులో ఉంచాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివాదం అత్యంత సున్నితమైనదని పేర్కొంటూ హిందూ, ముస్లిం పక్షాలు శాంతి, సహనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఈ ఏడాది మేలో మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్‌శాల దేవాలయమేనని పేర్కొంటూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) శుక్రవారం నమాజ్‌కు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తాజా విచారణలో సుప్రీంకోర్టు, కేసు తుది తీర్పు వచ్చే వరకు భోజ్‌శాల ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణాలు లేదా మార్పులు చేపట్టరాదని ఏఎస్ఐకి స్పష్టం చేసింది. అలాగే ఈ అంశంపై అవసరమైతే రోజువారీ విచారణ నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News