తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న వివాదాలపై అధ్యక్షురాలు సుమలతా దేవి, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. డాన్సర్లకు పారితోషకాల చెల్లింపులు, కొత్త సభ్యత్వాల అంశంలో తమపై వస్తున్న ఆరోపణలను సుమలతా దేవి ఖండించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్, అసోసియేషన్‌లో జరిగిన అంతర్గత సమావేశంపై వస్తున్న వదంతులను తోసిపుచ్చారు. శేఖర్ మాస్టర్‌కు, తనకు మధ్య గొడవ జరిగిందంటూ ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
“మా యూనియన్ సమస్యలపై మాత్రమే చర్చ జరిగింది. మేమంతా సోదరుల్లా కలిసి యూనియన్ సంక్షేమం కోసం పని చేస్తున్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు” అని జానీ మాస్టర్ తెలిపారు. దీంతో ఇద్దరు ప్రముఖ కొరియోగ్రాఫర్ల మధ్య విభేదాలపై వస్తున్న ప్రచారానికి ఆయన తెరదించారు.
Post Views: 6








