E-PAPER

30 సెకన్లలో 195 ముద్దులు.. గిన్నీస్ రికార్డు సృష్టించిన బ్రెజిల్ జంట

బ్రెజిల్‌కు చెందిన ఓ జంట కేవలం 30 సెకన్లలో 195 ముద్దులు పెట్టుకుని గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా ఈ ఫీట్ సాధించిన రెనాటో అల్వెస్, నయారా రాబర్టా రిబీరో డి మారిన్స్ జంట తమ అద్భుత సమన్వయంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

ఈ రికార్డు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యంత వేగంగా నమోదైన ముద్దుల రికార్డుగా నిలిచింది. జూలై 6న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ జంట నిర్ణీత 30 సెకన్లలో ఏకంగా 195 ముద్దులు పెట్టి కొత్త చరిత్ర సృష్టించింది.

ఇక్కడితో ఆగిపోకుండా మరిన్ని గిన్నీస్ రికార్డులు సాధించడమే తమ లక్ష్యమని ఈ జంట వెల్లడించింది. వారి వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News